యాదగిరిగుట్ట ఆలయ విద్యుత్‌ ఈఈ.. రూ.1.90 లక్షల లంచం డిమాండ్.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ..

4 months ago 3
యాదగిరిగుట్ట ఆలయ ఎలక్ట్రికల్‌ ఈఈ ఊడెపు రామారావును ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రసాదాల మెషీన్ల మెయింటెనెన్స్‌ బిల్లుగా రూ.11.50 లక్షలు రావాల్సి ఉన్న కాంట్రాక్టర్‌ నుంచి 20 శాతం కమీషన్‌ కోరాడు. కాంట్రాక్టర్‌ ఫిర్యాదు మేరకు మేడిపల్లి మెడ్‌ప్లస్‌ వద్ద రూ.1.90 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ టీం అతడిని అదుపులోకి తీసుకుంది. అనంతరం రామారావు కార్యాలయంలో సోదాలు జరిపి పలు ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. అవినీతి ఆరోపణలతో సస్పెండ్‌ అయ్యి మూడు నెలల క్రితం తిరిగి డ్యూటీకి వచ్చిన రామారావు, ఇటీవల ఎండోమెంట్‌ ఎస్‌ఈగా ప్రమోషన్‌ పొందిన విషయం తెలిసింది.
Read Entire Article