యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. తిరుమల టీటీడీ తరహాలో ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయ అభివృద్ధిపై సమీక్షించిన సీఎం.. రాజకీయాలకు తావు లేకుండా, ఆలయ పవిత్రత దెబ్బతినకుండా బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.