తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొందిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. మార్చి ఒకటో తేదీ నుంచి మొదలు 11వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించనుండగా.. ఆలయంలో నిత్యం జరిపే కొన్ని సేవలను రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాల దృష్ట్యా.. కళ్యాణాలు, హోమాలు, జోడు సేవలు, ఏకాదశి లక్ష పుష్పార్చణ సేవలు రద్దు చేయనున్నట్టు తెలిపారు.