యాదాద్రి పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. యాదగిరిగుట్ట పేరు మార్పును పునరుద్ధరించామని తెలిపారు. మూసీ ప్రక్షాళన తమ లక్ష్యమని స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లాలో ప్రాజెక్టుల పూర్తిపై బీఆర్‌ఎస్‌ను ప్రశ్నించారు. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని, అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ఆలేరు నియోజకవర్గంలో రూ.1500 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించామన్నారు. ఇక్కడే పలువురికి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు.