ఏపీ ప్రభుత్వం యానిమేటర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. యానిమేటర్లకు ఉచితంగా సెల్‌ఫోన్లు ఇవ్వనున్నారు. రూ.15000 విలువ చేసే స్మార్ట్‌ఫోన్లను యానిమేటర్లకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. యానిమేటర్లతో పాటుగా కమ్యూనిటీ కోఆర్డినేటర్లకు కూడా ఉచితంగా సెల్‌ఫోన్లు అందించనున్నారు. అలాగే ఏపీఎంలకు ల్యాప్‌టాప్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2014-19 మధ్యకాలంలో యానిమేటర్లకు ఫోన్లను అందించారు. అయితే అవి పాడైపోయిన నేపథ్యంలో కొత్త ఫోన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.