యాసంగి వరి సాగు, ధాన్యం కొనుగోళ్లు.. దేశంలోనే నంబర్ వన్ స్థానంలో తెలంగాణ

1 hour ago 1
2025-26 యాసంగి (రబీ) సీజన్‌లో వరి సాగుతో పాటు ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 59.90 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగ్గా.. ఇది దేశం మొత్తం యాసంగి సాగు విస్తీర్ణంలో సగానికి పైగా ఉండటం విశేషం. ఖరీఫ్, రబీ రెండు సీజన్లను కలిపి చూస్తే అత్యధిక సాగు విస్తీర్ణంలో ఉత్తరప్రదేశ్ తర్వాత తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ఇప్పటికే 72.30 లక్షల టన్నులకు చేరగా.. త్వరలోనే 75 లక్షల టన్నుల మార్కును దాటనుంది. ప్రభుత్వ ఉచిత విద్యుత్, సన్న బియ్యానికి బోనస్, రైతుభరోసా వంటి పథకాలే ఈ విజయానికి ప్రధాన కారణమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Read Entire Article