డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లి గ్రామంలో అక్రమ ఆక్వా సాగుదారులు అరాచకంగా వ్యవహరించారు. అక్రమ ఆక్వా చెరువుల ఫోటోలు తీస్తున్న దుర్గాప్రసాద్ అనే యువకుడిని స్తంభానికి కట్టేసి కొట్టారు. ఈ ఘటనలో గాయపడిన యువకుడు అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. ఈ ఘటనపై బాధితుడు దుర్గాప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన ఉప్పలగుప్తం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.