తెలంగాణ రాజకీయాల్లో సంచలనం. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత రావును బ్లాక్‌మెయిల్ చేసిన యూట్యూబర్ శ్యామ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వ్యక్తిగత వీడియోలను బహిర్గతం చేస్తానని బెదిరించి రూ.5 కోట్లు డిమాండ్ చేయడంతో ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. ఈ వ్యవహారంలో ఒక మహిళ పాత్రపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.