తెలంగాణ మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసిన ప్రణయ్ హత్య కేసులో.. ఏడేళ్ల తర్వాత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఏ1 మారుతీరావు ఆత్మహత్య చేసుకోగా.. ఏ2కు ఉరిశిక్ష, మిగతా నిందితులను యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే.. కోర్టు తీర్పు అనంతరం అమృత.. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫోన్ చేసింది. హత్య సమయంలో నల్గొండ ఎస్పీగా ఉన్న రంగనాథ్ నిజాయితీగా దర్యాప్తు చేయటం వల్లే.. ఈరోజు న్యాయం జరిగిందంటూ అమృత.. భావోద్వేగానికి లోనైనట్టు తెలుస్తోంది.