తాను కొత్త పార్టీ పెడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందించారు. అలాంటివన్నీ అవాస్తవాలని.. కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. తెలుగువీర లేవరా పేరుతో ఏర్పాటు చేసిన ఫోరమ్.. కేవలం న్యాయ సహాయం అవసరమైన వారికి ఉచితంగా సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన సొసైటీ మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. దీనికి, పార్టీకి సంబంధం లేదని రఘురామ వీడియో విడుదల చేశారు.