మాజీ ఎంపీ, ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో మాజీ పోలీస్ అధికారి అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి సీఐడీ అడిషనల్ ఎస్పీ విజయ్‌పాల్‌ను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టులో వేసిన బెయిల్ పిటిషన్ కొట్టివేయటంతో విజయ్‌పాల్ ఇవాళ పోలీసుల విచారణకు హాజరయ్యారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకూ సుదీర్ఘంగా విచారించిన పోలీసులు.. రాత్రి అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ప్రకాశం జిల్లా ఎస్సీ అధికారికంగా ప్రకటించారు.