మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో రన్నింగ్ కారులో మంటలు చేలరేగాయి. అంబర్‌పేట నుంచి పీర్జాదిగూడ వైపు వెళ్తోన్న కారులో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. రన్నింగ్ కారులో మంటలు రావటాన్ని గమనించిన కారు యజమాని రామనాథం కారు రోడ్డు పక్కన నిలిపి అందులో నుంచి కిందకు దిగారు. అనంతరం క్షణాల్లోనే కారుకు మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్‌తోనే కారులో ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.