Rajamahendravaram Woman Murder Case: రాజమహేంద్రవరంలో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. దివాన్‌చెరువు శివారు అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని మహిళ మృతదేహంగా లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలు మీరాగా గుర్తించారు. ఆమె కుమార్తె కాలి పట్టీలను గుర్తుపట్టడంతో కేసు కీలక మలుపు తిరిగింది. నిమ్మాదుల జ్యోతిసాయి శంకర్ అనే వ్యక్తి మీరాను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. డబ్బు విషయంలో గొడవలు జరగడంతో సాయి ఆమెను హత్య చేశాడు.