వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. తరచూ వార్తల్లో నిలిచే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మీద కేసులు కూడా అదే స్థాయిలో నమోదవటం తెలిసిందే. అయితే.. రాజాసింగ్ మీద నమోదైన ఓ మూడు కేసుల్లో ఆయనను నిర్దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చింది నాంపల్లి ప్రత్యేక కోర్టు. విద్వేషపూరిత ప్రసంగం, ఎన్నికల ర్యాలీ, శ్రీరామ నవమి ర్యాలీ సందర్భాల్లో రూల్స్ అతిక్రమించారంటూ పోలీసులు పెట్టిన కేసుల్లో చివరికి నిర్దోషిగా తేల్చింది నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం.