Rajiv Gandhi Statue: తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముందు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ, కేటీఆర్‌పై ఘాటు విమర్శలు చేశారు. రాజీవ్ గాంధీ లేకపోతే.. కేటీఆర్ గుంటూరులో ఇడ్లీ, వడ అమ్ముకుంటూ తిరిగేవాడంటూ ఎద్దేవా చేశారు. రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన ఐటీ సంస్కరణల వల్లే అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఎంతో మంది భారతీయులు రాణిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.