తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి ఊహించిన దానికంటే తక్కువ దరఖాస్తులు వచ్చాయి. ముఖ్యంగా మొదటి రెండు కేటగిరీల రుణాలకు స్పందన తక్కువగా ఉండటంతో.. ఈ కేటగిరీల కింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారందరికీ పూర్తి స్థాయిలో లబ్ధి చేకూరనుంది. అయితే.. రూ.4 లక్షల విలువైన యూనిట్ల కోసం మాత్రం అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. తక్కువ దరఖాస్తులు వచ్చిన కేటగిరీల నిధులను ఇతర కేటగిరీలకు మళ్లించే యోచనలో ప్రభుత్వం ఉంది. అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు ఆన్‌లైన్ డేటాబేస్ ఆధారంగా క్షేత్రస్థాయి పరిశీలన జరపాలని సంక్షేమ శాఖ నిర్ణయించింది.