హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఉన్న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఓపెన్ ప్లాట్ల బహిరంగ వేలానికి సోమవారం (మే 18) భారీ స్పందన లభించింది. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని తొర్రూరు, కుర్మల్‌గూడ, బహదూర్‌పల్లి లేఅవుట్లలోని మొత్తం 85 ప్లాట్లకు నిర్వహించిన ఈ వేలంలో బిడ్డర్లు పోటీ పడి కొనుగోలు చేశారు. నిర్దేశించిన కనీస ధర కంటే అదనపు ధరలు పలకడంతో ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.83 కోట్ల మేర భారీ ఆదాయం సమకూరింది.