హీరో రాజ్ తరుణ్ తనని పెళ్లి చేసుకొని మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి కొద్ది రోజుల కిందట పోలీసులకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కంప్లెయింట్‌పై ఆధారంగా కేసు నమోదయ్యింది. కానీ, తొలుత ఆమె ఆధారాలు సమర్పించకపోవడంతో పోలీసులు.. నోటీసులు జారీచేయడంతో రెండోసారి లావణ్య ఆధారాలతో ఫిర్యాదు చేసింది. తనని మోసం చేశాడనడానికి పూర్తి ఆధారాలను పోలీస్ స్టేషన్‌లో సమర్పించినట్లు ఆమె మీడియా సమావేశంలో వెల్లడించిన విషయం తెలిసిందే