ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ గేట్ల మూసివేత సమయాన్ని రాత్రి 9 గంటల వరకు పొడగిస్తూ వీసీ కుమార్ ఆదేశాలిచ్చారు. గతంలో రాత్రి 8 గంటలకు గేట్లు క్లోజ్ అయ్యేవి. తాజాగా మరో గంట అదనంగా గేట్లు ఓపెన్ చేసి ఉంచనున్నారు. ఈ నిర్ణయం వల్ల నల్లకుంట, తార్నాక వంటి కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీకి చెక్ పడనుంది. క్యాంపస్‌లో నిత్యం రాకపోకలు సాగించే అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులకు కూడా ఊరట కలగనుంది.