హైదరాబాద్‌లోని రామాంతపూర్‌లో శ్రీకృష్ణుడి శోభాయాత్రలో విద్యుత్ ప్రమాదం జరిగి ఆరుగురు మరణించారు. రథం విద్యుత్ తీగలకు తగలడంతో ఈ దుర్ఘటన జరిగింది. తండ్రి కళ్ల ముందే కుమారుడు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.