రాయదుర్గంలో ఇటీవల వేలంలో భారీగా ధర పలికిన భూమికి సంబంధించి సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఆ భూములు తమవే అంటూ ఎస్‌బీఐ.. హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఎస్‌బీఐ పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారణ జరపనుంది. ఇటీవల రాయదుర్గం భూములకు నిర్వహించిన వేలంలో ఎకరం రూ.237 కోట్లు పలిగి అందర్నీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఎస్‌బీఐ పిటిషన్‌తో ఆ భూములు మరోసారి వార్తల్లో నిలిచాయి.