రాయలసీమలోని పలు జిల్లాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా సయ్యద్ సుల్తాన్‌ను అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. టెక్నాలజీ ఆధారంగా అతనిపై నిఘా పెట్టి అరెస్టు చేసినట్లు తెలిపారు. పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేయడంతో ఆరు నెలలు జైలులోని ఉండాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఆ తర్వాత మళ్లీ అరెస్టు చేస్తామని వెల్లడించారు. సయ్యద్ సుల్తాన్‌పై మూడు గంజాయి, రెండు హత్య కేసులు, ఏడు హత్యాయత్నం కేసులు, దోపిడీ కేసు ఒకటి, ఎక్సైజ్ కేసు 1, గొడవ కేసులు 2, బైండోవర్ కేసులు రెండు ఉన్నాయని చెప్పారు.