Renigunta Railway Station 166 Years: రాయలసీమలో రైల్వే స్టేషన్‌కు 166 ఏళ్ల చరిత్ర ఉంది.. 1860 ఆగస్టు 26న తిరుపతి జిల్లా రేణిగుంట రైల్వే స్టేషన్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ రైల్వే స్టేషన్ రాయలసీమలో ముఖ్యమైన జంక్షన్‌గా కూడా మారింది. ముందు 10 ఉద్యోగులతో ప్రారంభమై.. ఇప్పుడు వందలమంది ఉద్యోగులు, వేలాదిమంది ప్రయాణికులతో బిజీగా మారింది. ఈ రేణిగుంట రైల్వే స్టేషన్‌ను వ్యాపారాలను విస్తరించడం కోసం బ్రిటీష్ హయాంలో ప్రారంభించారు.