Kurnool AP High Court Bench Buildings రాయలసీమవాసుల కల నెరవేరబోతోంది.. ఏపీ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషాకు హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) వి.శ్రీనివాస శివరాం ఈ నెల 29 లేఖ రాశారు. అందులో జడ్జిలకు, కోర్టు సిబ్బంది, లాయర్ల కోసం భవనాలు గుర్తించాలని.. ఆ వివరాలను వెంటనే పంపించాలని కోరారు.