ఏపీలో పరిషత్ ఎన్నికల పోలింగ్ గురువారం జరిగింది. ఈ సందర్భంగా గ్రామీణ ప్రజలు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సగటున 70.72 శాతం పోలింగ్ నమోదైనట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 82.51 శాతం ఓటింగ్ నమోదైంది. కేవలం 62.01 శాతం ఓటింగ్‌తో అల్లూరి జిల్లా జాబితాలో లాస్ట్ ప్లేస్‌లో నిలిచింది. అలాగే చిత్తూరు 76.30 శాతంతో సెకండ్ ప్లేస్‌లో నిలబడగా, 76.21 శాతంతో విజయనగరం మూడో ప్లేస్‌లో ఉంది.