తెలంగాణలో రద్దు చేసిన 40 బార్ల పునరుద్ధరణలో భాగంగా రూరల్ ప్రాంతంలోని 25 బార్లకు 1346 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు లక్ష రూపాయల ఫీజు రావడంతో ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం లభించింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన దరఖాస్తుల వివరాలను అధికారులు వెల్లడించారు. అయితే, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని బార్‌కు మాత్రం ఒకే దరఖాస్తు రావడంతో గడువును మే 5 వరకు పొడిగించారు. బార్ల కేటాయింపు కోసం ఏప్రిల్ 29న డ్రా నిర్వహించనున్నారు.