రాష్ట్రంలో అతి పెద్దదైన మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం చెంగిచర్ల కబేళా నిర్వహణ బాధ్యతపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రైవేటు సంస్థకు నిర్వహణను అప్పగించగా.. బుధవారంతో దాని గడవు ముగిసింది. దీంతో టెండర్లు పిలిచే వరకు రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్యకు బాధ్యతలు అప్పగించింది. ఈ కబేళా ద్వారా సమాఖ్యకు ఏడాదికి రూ.2 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది.