Telangana Airports Traditional Architecture: ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, ఢిల్లీలోని తెలంగాణ భవన్ నిర్మాణాలు తెలంగాణ సంస్కృతి, చరిత్రకు ప్రతీకలుగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయం, పిల్లలమర్రి దేవాలయం శిల్ప, వాస్తు కళల స్ఫూర్తితో డిజైన్లు రూపొందించాలని సూచించారు. విమానాశ్రయాల వద్ద విద్యుత్, నీరు, బీఎస్‌ఎన్‌ఎల్, రహదారులు, వాగుల మళ్లింపు పనులను సమన్వయంతో చేపట్టాలని చెప్పారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విశాల రహదారులు, నీటి నిర్వహణతో సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.