ఏపీలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని ఇప్పటికే చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకోగా.. తాజాగా వాటికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేసింది. కొత్తగా 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు, ఒక మండలాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాలు ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 29కి పెరిగింది. జిల్లాల పునర్విభజనపై మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.