దేశంలోనే అత్యధిక ధాన్యం ఉత్పత్తి సాధించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచినప్పటికీ.. మార్కెట్‌లో సన్న బియ్యం ధరలు మాత్రం ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. మిల్లర్లు, హోల్‌సేల్ వ్యాపారులు సన్న బియ్యం నిల్వలను అక్రమంగా దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టించడమే దీనికి ప్రధాన కారణం. గత 10 రోజుల్లోనే కిలోకు రూ. 5 నుంచి రూ. 7 వరకు ధరలు పెరిగాయి. ముఖ్యంగా డిమాండ్ ఉన్న రెండేళ్ల నాటి పాత బియ్యాన్ని తక్కువ పరిమాణంలో మార్కెట్లోకి వదులుతూ వ్యాపారులు సామాన్య, మధ్యతరగతి వినియోగదారులను నిలువునా దోచుకుంటున్నారు.