టాలీవుడ్‌లో విభిన్నమైన కంటెంట్‌ను తెరపై ఆవిష్కరించడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘హనుమాన్’ చిత్రంతో ఆయన అందించిన విజువల్ వండర్ ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘జై హనుమాన్’ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.