రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగం నిర్మాణం విషయంలో కీలక ముందడుగు పడింది. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులను మంజూరు చేసింది. రీజినల్ ఎంపవర్డ్ కమిటీ అనుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రాజెక్టు నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.