తెలంగాణ రీజినల్ రింగు రోడ్డు ఉత్తరభాగం టెండర్ల ప్రక్రియ మరోసారి వాయిదా పడింది. సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి యాదాద్రి జిల్లా తంగడ్‌పల్లి వరకు 161.518 కిలోమీటర్ల ఆరు వరసల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణాన్ని రెండు ప్యాకేజీలుగా చేపట్టేందుకు ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లు పిలిచింది. బిడ్‌ల గడువును పలుమార్లు పొడిగించిన అధికారులు తాజాగా సెప్టెంబరు 23 వరకు మరోసారి గడువు పెంచారు. ప్రాజెక్టుకు కేటాయింపులు, రహదారి నంబర్, కీలక అనుమతులు ఉన్నప్పటికీ టెండర్లలో జాప్యంపై రాష్ట్ర అధికారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.