తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న రీజినల్ రింగ్ రైలు ఉత్తర భాగం డీపీఆర్ సిద్ధమైంది. రూ.11,517.51 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ఈ డీపీఆర్‌ను జులై 30న కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. రైల్వే బోర్డు ఎలైన్‌మెంట్, సాంకేతిక అంశాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనుంది. మొత్తం ఉత్తర, దక్షిణ భాగాలు కలిపి 392 కిలోమీటర్ల మేర ప్రాజెక్టును ప్రతిపాదించారు. భూసేకరణను సులభతరం చేసేందుకు రీజినల్ రింగ్ రోడ్డుకు అనుగుణంగా ఎలైన్‌మెంట్‌లో మార్పులు చేసినట్లు సమాచారం.