తెలంగాణ రాష్ట్రానికి గేమ్ ఛేంజర్‌గా మారనున్న రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఆర్ఆర్ఆర్‌లో ఉత్తర భాగానికి సంబంధించి.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే టెండర్లను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించి.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రీజినల్ రింగు రోడ్డు నిర్మించే మార్గంలో.. భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు.