రూ.10 లక్షలు పెట్టి పుస్తకాలు కొన్న పవన్ కళ్యాణ్!.. ఏమేం కొన్నారంటే?

1 week ago 4
విజయవాడలో జరుగుతున్న బుక్‌ ఫెయిర్‌ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు. శనివారం ఉదయం బుక్ ఫెయిర్ వద్దకు వెళ్లిన పవన్ కళ్యాణ్.. పలు పుస్తకాలను కొనుగోలు చేశారు. దాదాపు రెండున్నర గంటలపాటు అక్కడ ఉన్న ఆయన పలు స్టాళ్లను పరిశీలించారు. అనేక పుస్తకాలు కొనుగోలు చేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలా మూడు భాషలకు చెందిన పుస్తకాలు పవన్ కొనుగోలు చేశారు. తెలుగు సాహిత్యానికి సంబంధించి పలు పుస్తకాలను పరిశీలించారు. ప్రముఖ రచయితల నుంచి యువ రచయితల రచనల వరకూ పలు పుస్తకాలు కొనుగోలు చేశారు. అనువాద సాహిత్య పుస్తకాలు, నిఘంటువులు, ఆధ్యాతిక సంబంధిత రచనలు పరిశీలించి కొనుగోలు చేశారు. డా.విక్టర్ ఈ.ఫ్రాంకిల్ రాసిన ‘మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్’ పుస్తకాన్ని ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేశారు. భారతీయ చట్టాలు, చరిత్ర, రాజకీయ, పబ్లిక్ పాలసీ, శాస్త్ర సాంకేతిక, వ్యవసాయ, వృక్ష, పర్యావరణ సంబంధిత పుస్తకాలను పవన్ కళ్యాణ్ కొనుగోలు చేశారు. సుమారుగా రూ.10 లక్షల విలువ చేసే పుస్తకాలను పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసినట్లు తెలిసింది. పిఠాపురం నియోజకవర్గంలో లైబ్రరీ ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందుకోసం తన సొంత నిధులతో ఈ పుస్తకాలు కొనుగోలు చేసినట్లు తెలిసింది.
Read Entire Article