విశాఖపట్నంలో రోడ్ల సదుపాయాలను మెరుగుపరిచే దిశగా వీఎంఆర్డీఏ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.174 కోట్లతో ఏడు రహదారులను నిర్మించనుంది. ఈ రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలపగా.. వీఎంఆర్డీఏ టెండర్లను కూడా ఖరారు చేసింది. తాజాగా పనులు ప్రారంభించేందుకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ఈ రహదారులను భోగాపురం విమానాశ్రయానికి అనుసంధానించే జాతీయ రహదారి మీద ఒత్తిడిని తగ్గించేందుకు నిర్మించనున్నారు.