హైదరాబాద్‌లో యాదవుల సదర్ వేడుకలకు సర్వం సిద్ధమైంది. దీపావళి మరుసటి రోజు జరిగే ఈ దున్నపోతుల పండుగలో 200కు పైగా భారీ దున్నపోతులు పాల్గొంటున్నాయి. ముఖ్యంగా కేరళ నుంచి వచ్చిన రూ.25 కోట్ల విలువైన 'కాళీ' దున్నరాజు అందరినీ ఆకట్టుకోనుంది. ఖరీదైన ఆహారం, ప్రత్యేక సంరక్షణతో ఈ దున్నలు వేడుకలకు హైలైట్‌గా నిలవనున్నాయి.