నకిలీ పత్రాలతో రూ. 27 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని విక్రయించేందుకు ప్రయత్నించిన ఆరుగురు సభ్యుల ముఠాను రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు పట్టాదారుడి సోదరుడి ఫిర్యాదుతో ఈ అక్రమం బయటపడింది. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపు ముమ్మరం చేశారు.