రూ.5 ఎంత పని చేసింది.. ఆ ప్రాంతామంతా ట్రాఫిక్ జామ్.. కారణం ఏంటంటే..

4 months ago 9
హైదరాబాద్‌లో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. కోఠీ నుంచి పటాన్‌చెరు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో గంగారం బస్టాప్ వద్ద రూ.5 చిల్లర ఇవ్వలేదని ఓ ప్రయాణికుడు ఆగ్రహంతో బస్సు ముందు అడ్డంగా కూర్చొని ఆందోళన చేశాడు. దీంతో రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరికి కండక్టర్ ఆ ప్రయాణికుడికి రూ.5 చిల్లర ఇచ్చి పంపించడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ ఘటనపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ చిన్న మొత్తానికి పెద్ద వివాదం ఎందుకు సృష్టించాడని వ్యాఖ్యానించారు.
Read Entire Article