రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రా, హైదరాబాద్‌లో అక్రమార్కులకు చెక్ పెట్టే పనిలో దూసుకుపోతుంది. నగరంలో ఎక్కడ భూకబ్జాలు, అక్రమ నిర్మాణాల ఉన్నట్లు సమాచారం అందినా సరే.. వాటిపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. పేద, ధనిక తేడా లేకుండా అందరిపై కఠినంగా వ్యవహరిస్తూ, చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను కాపాడుతోంది. మణికొండలో రూ.500 కోట్ల విలువైన భూమిని కాపాడటంతో స్థానికులు హైడ్రాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అభినందన సభ ఏర్పాటు చేశారు. ఆ వివరాలు..