Kakinada Consumer Commission Fined Shopkeeper Rs 7 Lakhs: కాకినాడ జిల్లాలో వాటర్‌బాటిల్‌ను ఎమ్మార్పీకి మించి విక్రయించిన షాపు నిర్వాహకుడికి వినియోగదారుల ఫోరం షాక్ ఇచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 22న అన్నవరం ఆలయానికి వెళ్లిన భక్తుడు ఓ షాపులో వాటర్ బాటిల్ కొనుగోలు చేశాడు. ఎమ్మార్పీ రూ.18 ఉంటే రూ.25 తీసుకోవడంతో ఆలయ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. భక్తుడి నుంచి అదనంగా వసూలు చేసిన ఏడు రూపాయలు, కోర్టు ఖర్చుల కింద రూ.10వేలు, రూ.5వేలతో పాటుగా వినియోగదారుల సంక్షేమ నిధికి రూ.7లక్షలు చెల్లించాలని ఆదేశించింది.