హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో మొదలైన చిన్న తనిఖీలు.. దేశవ్యాప్తంగా ఏకంగా రూ.70 వేల కోట్ల బిర్యానీ కుంభకోణాన్ని బయటపెట్టాయి. బిల్లులను తక్కువగా చేసి చూపించి.. ప్రభుత్వానికి కట్టే పన్నులను ఎగ్గొట్టినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. అయితే ఏఐ టూల్స్ ఉపయోగించి.. ఈ భారీ స్కామ్‌ను వెలుగులోకి తీసుకువచ్చారు. ఏకంగా 1.77 లక్షల రెస్టారెంట్ల నుంచి 60 టీబీల బిల్లింగ్ డేటాను విశ్లేషించి.. ఈ కుంభకోణాన్ని ప్రపంచానికి తెలియజేశారు. బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌లో అవకతవకలను గుర్తించి.. తనిఖీలు చేయగా ఈ అసలు మోసం వెలుగులోకి వచ్చింది.