క్రిప్టో కరెన్సీ, బిట్‌కాయిన్‌లలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయంటూ నమ్మిస్తున్న ముఠా.. వందల కోట్ల రూపాయలను కొట్టేస్తోంది. మరీ ముఖ్యంగా పోలీసులు, టీచర్లు, వ్యాపారులే లక్ష్యంగా భారీ లాభాలు ఆశ చూపిస్తూ.. వారిని నట్టేట ముంచేస్తున్నారు. ఫేక్ క్రిప్టో కరెన్సీ ఎరవేసి రూ.కోట్లను కొల్లగొడుతున్నారు. ఒక్కసారి పెట్టుబడి పెడితే నెలకు ఆదాయం వస్తుందని చెప్పి నమ్మించి అమాయకులను దోచేస్తున్నారు.