తెలంగాణలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో ఆయా జిల్లాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న పశువైద్యాధికారులు చనిపోయిన కోళ్లను పరీక్షల నిమిత్తం హైదరాబాద్ ల్యాబ్‌కు పంపించారు.