AP Minister Savitha Stops Biker Not Wear Helmet: ఏపీ మంత్రి సవిత రహదారి భద్రతా దినోత్సవాల్లో పాల్గొన్నారు. మంత్రి స్వయంగా బైక్ నడిపి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ క్రమంలో వాహనదారులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ఈ క్రమంలో యువకుడు హెల్మెట్ లేకుండా బైక్‌పై వచ్చాడు. వెంటనే బైక్ ఆపి యువకుడి తల్లికి ఫోన్ చేసి అప్రమత్తం చేశారు. హెల్మెట్ లేకుండా బైక్ నడపడకూడదని చెప్పారు. అతడికి హెల్మెట్ ఇచ్చి పంపించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.