ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి చర్చించేందుకు పలువురు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసేందుకు రెడీ అయినట్లు సమాచారం. ఇక నేడు కేబినెట్ భేటీ జరగనుండగా.. దీనిపై చర్చించి.. ఆ తర్వాత ఒక స్పష్టమైన ప్రకటన వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. డిమాండ్లు పరిష్కరించేవరకు సమ్మె విరమించబోమని ఆర్టీసీ కార్మికులు స్పష్టం చేస్తుండగా.. ఆందోళనలు ఆపాలని సర్కార్ విజ్ఞప్తి చేస్తోంది.