ఏపీలోని నంద్యాల పట్టణంలో హిజ్రాలు రెచ్చిపోయారు. ఒకరికొకరు అసభ్య పదజాలంతో దూషించుకుని ఘర్షణకు దిగారు. స్థానిక రెండో పట్టణ పోలీసు స్టేషన్ ఎదురుగా రహదారిపై ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. రహదారిపై ఈ ఘర్షణ జరగడం వల్ల అటుగా వెళ్లే పాదచారులు ఆ రాళ్లు వారికెక్కడ తగులుతాయోనని తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరు వర్గాలకు చెందిన హిజ్రాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నంద్యాల, పాణ్యం ప్రాంతాలకు చెందిన హిజ్రాల మధ్య డబ్బు విషయంలో వాగ్వాదం జరిగి ఘర్షణకు దారి తీసింది.