ఏపీ మంత్రివర్గ సమావేశం శుక్రవారం ఉదయం 10:30 గంటలకు సచివాలయంలో జరగనుంది. దీనికి సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షత వహిస్తారు. ఈ బేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించడం జరుగుతుంది. ముఖ్యంగా రాజధాని అమరావతి అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల తేదీలను ఖరారు చేస్తారా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది.