తెలంగాణలో ఇటీవల కొన్ని ప్రాంతాల్లో ‘మార్వాడీలు గో బ్యాక్’ అంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక వ్యాపారులు, చిన్న కూలీ కార్మికులు తమ జీవనోపాధి క్షీణించిందని ఆరోపిస్తున్నారు. మార్వాడీ వ్యాపారులు పెద్ద ఎత్తున వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ రంగాల్లో పట్టు సాధించడంతో స్థానికులకు నష్టం జరుగుతుందని.. దీనిలో భాగంగానే రేపు తెలంగాణ బంద్‌కు ఓయూ జేఏసీ పిలుపునిచ్చింది. అయితే ఈ బంద్‌లో నల్గొండ, వరంగల్ జిల్లాలోని వ్యాపారులు పూర్తి మద్దతు పలికారు.